మొదటి పేజీ

ఈ వారపు వ్యాసం
బహుళ వర్ణపట చిత్రాలు

బహుళ వర్ణపట చిత్రణ అనేది విద్యుదయస్కాంత వర్ణపటంలోని నిర్దిష్ట తరంగదైర్ఘ్యాల్లోని కాంతిని ఉపయోగించి తీసే చిత్రాల సమాహారం. దీనిలో దృగ్గోచర కాంతిని మాత్రమే కాకుండా పరారుణ, అతినీలలోహిత తరంగాలను కూడా ఉపయోగిస్తారు. తరంగదైర్ఘ్యాలను ఫిల్టర్‌ల ద్వారా వేరు చేయవచ్చు, లేదా వేర్వేరు తరంగదైర్ఘ్యాలను సంగ్రహించడానికి వేర్వేరు పరికరాలను ఉపయోగించవచ్చు. మనిషి కన్నులో ఉండే ఎరుపు, ఆకుపచ్చ, నీలం రంగుల గ్రాహకాల (రిసెప్టర్ల) ద్వారా చూడగలిగే విశేషాల కంటే ఎన్నో రెట్లు అధికంగా బహుళ వర్ణపట చిత్రణ ద్వారా చూడవచ్చు. తొలుత సైనిక లక్ష్య గుర్తింపూ, నిఘా అవసరాల కోసం అభివృద్ధి చేసినా, తరువాత అంతరిక్ష పర్యవేక్షణ, భూ పర్యవేక్షణ సహా ఎన్నో ప్రయోజనాలకు ఈ సాంకేతికత ఉపయోగపడుతోంది. తొట్టతొలి అంతరిక్ష-ఆధారిత ఇమేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లు (ఉపగ్రహాలు) తీరప్రాంత సరిహద్దులు, వృక్షసంపద, భూభాగాలకు సంబంధించిన వివరాలను మ్యాప్ చేయడానికి బహుళ వర్ణపట చిత్రణ సాంకేతికతను ఉపయోగించాయి. దస్తావేజులు, చిత్రపటాల విశ్లేషణలోనూ బహుళ వర్ణపట చిత్రణను ఉపయోగిస్తున్నారు. బహుళ వర్ణపట చిత్రణ కొన్ని పరిమిత స్పెక్ట్రల్ బ్యాండ్‌లలో (సాధారణంగా 3 నుండి 15) కాంతిని కొలుస్తుంది. హైపర్‌స్పెక్ట్రల్ చిత్రణ అనేది ఒక ప్రత్యేకమైన బహుళ వర్ణపట చిత్రణ. ఇందులో వందల కొద్దీ స్పెక్ట్రల్ బ్యాండ్లు అందుబాటులో ఉంటాయి.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... కౌముది నరసింహం (1905 - 1983) తెలుగు నాటకంలో తాత్వికతకు స్థానం కల్పించిన వారిలో ఒకరనీ!
  • ... న్యాయ సూత్రం భారతీయ న్యాయతత్వశాస్త్రానికి సంబంధించి పురాతన రచన అనీ!
  • ... రోడేషియా ప్రస్తుతం జింబాబ్వేగా పిలువబడుతున్నదనీ!
  • ... వాణిజ్యస్థాయిలో విస్తృతంగా ఉత్పత్తి అవుతున్న మకాడమియా మొక్క మొదట్లో ఆదిమజాతులకు ముఖ్యమైన వనరుగా ఉండేదనీ!
  • ... గాణపత్యం వినాయకుడిని పరబ్రహ్మస్వరూపంగా కొలిచే హిందూ ఉపసాంప్రదాయమని!
చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 15:
ఈ వారపు బొమ్మ
అరుణాచల్ ప్రదేశ్, తవాంగ్ లోని పెద్ద బుద్ధ విగ్రహం

అరుణాచల్ ప్రదేశ్, తవాంగ్ లోని పెద్ద బుద్ధ విగ్రహం

ఫోటో సౌజన్యం: Yatrika


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.
భాష