15వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు

15వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు భారతదేశంలో 1967 సంవత్సరంలో విడుదలైన ఉత్తమ భారతీయ చలనచిత్రాలు, కళాకారులు, సాంకేతిక నిపుణులను సత్కరించేందుకు భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయిన పురస్కారాలు.[1][2] ఈ పురస్కార ప్రదానోత్సవం 1968 నవంబర్ 25న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది. అప్పటి భారత రాష్ట్రపతి జాకిర్ హుస్సేన్ విజేతలకు పురస్కారాలను అందజేశాడు.

15వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు
Awarded for1967 ఉత్తమ చలనచిత్రాలు
Awarded byభారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
Presented byజాకిర్ హుసేన్
(భారత రాష్ట్రపతి)
Announced on1968 అక్టోబరు 31 (1968-10-31)
Presented on1968 నవంబరు 25 (1968-11-25)
Siteవిజ్ఞాన్ భవన్, న్యూఢిల్లీ
Official websitedff.nic.in
Highlights
ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ చలనచిత్రంహతే బజారే
ఎక్కువ పురస్కారాలు  చిరియాఖానా
  హమ్‌రాజ్
  ఉపకార్ (2)

15వ జాతీయ చలనచిత్ర పురస్కారాల నుంచి పురస్కారాల రూపకల్పనలో గణనీయమైన మార్పులు చేపట్టబడ్డాయి. కొత్త పురస్కారాలను ప్రవేశపెట్టడంతో పాటు, చిత్రాలను ఫీచర్ చిత్రాలు, లఘు చిత్రాలు అనే రెండు ప్రధాన విభాగాలుగా వర్గీకరించారు. ఫీచర్ చిత్రాలకు సంబంధించిన అఖిల భారత పురస్కారాలు,ప్రాంతీయ పురస్కారాలు కొనసాగించబడినప్పటికీ, కళాకారులను, సాంకేతిక నిపుణులను సత్కరించేందుకు అఖిల భారత స్థాయిలో మరికొన్ని కొత్త పురస్కారాలను ప్రవేశపెట్టారు.

15వ జాతీయ చలనచిత్ర పురస్కారాల నుంచి ఫీచర్ చిత్రాల విభాగంలో ప్రవేశపెట్టిన ప్రధాన పురస్కారాలు ఇవి:

అదేవిధంగా, 15వ జాతీయ చలనచిత్ర పురస్కారాల నుంచి లఘు చిత్రాలకు కూడా ప్రత్యేక పురస్కార వ్యవస్థను ప్రవేశపెట్టారు. దేశంలో నిర్మితమైన వివిధ రకాల లఘు చిత్రాలకు ఉత్తమ ప్రచార చిత్రం, ఉత్తమ విద్యా/బోధనాత్మక చిత్రం, ఉత్తమ సామాజిక డాక్యుమెంటేషన్ చిత్రం తదితర విభాగాలతో కలిపి మొత్తం ఏడు కొత్త పురస్కారాలు ఏర్పాటు చేయబడ్డాయి.

అలాగే, 15వ జాతీయ చలనచిత్ర పురస్కారాల నుంచి అన్ని విభాగాలలో ప్రదానం చేయబడుతున్న ప్రశంసాపత్రంను రద్దు చేశారు. దీనివల్ల ఉత్తమ ద్వితీయ ఫీచర్ చిత్రం విభాగాన్ని మినహాయించి, మిగిలిన అన్ని విభాగాలలో రెండవ, మూడవ ఉత్తమ చిత్రం/డాక్యుమెంటరీలకు ఇచ్చే పురస్కారాలు కూడా నిలిపివేయబడ్డాయి.

న్యాయనిర్ణేతలు

మార్చు

భారతదేశంలోని చలనచిత్ర నిర్మాణ రంగాన్ని దృష్టిలో ఉంచుకొని, ప్రధానంగా బొంబాయి, కలకత్తా, మద్రాస్ కేంద్రాల ఆధారంగా వివిధ పురస్కార విభాగాలకు అనుగుణంగా ఆరు వేర్వేరు న్యాయనిర్ణేత కమిటీలను ఏర్పాటు చేశారు. అదనంగా, ప్రాంతీయ కమిటీలలోని కొందరు సభ్యులతో కూడిన ఒక "అఖిల భారత కేంద్ర న్యాయనిర్ణేత కమిటీ"ని కూడా ఏర్పాటు చేశారు. 15వ జాతీయ చలనచిత్ర పురస్కారాల కేంద్ర కమిటీకి ఆర్. కె. నెహ్రూ అధ్యక్షత వహించాడు.[1]

కేంద్ర న్యాయనిర్ణేత కమిటీ
డాక్యుమెంటరీ చిత్రాల న్యాయనిర్ణేత కమిటీ
  • పద్మజా నాయుడు (అధ్యక్షురాలు) * మురియల్ వాసి * జె. డి. సింగ్ * ఆర్. ఎస్. శర్మ * లెన్ చాట్‌విన్
లఘు చిత్రాల న్యాయనిర్ణేత కమిటీ
ప్రాంతీయ న్యాయనిర్ణేత కమిటీ – బొంబాయి
  • వి. ఎ. నాయక్ (అధ్యక్షుడు) * అలో జె. చిబ్బర్ * అనంత్ కనేకర్ * ఆర్. శ్రీనివాసన్ * రామ్ జోషి * కె. జె. ఖంబట్టా * భాను ప్రసాద్ పాండ్యా * పన్నాలాల్ మహేశ్వరి * సదాశివ్ జె. రావ్ కవి * బానీ తల్వార్
ప్రాంతీయ న్యాయనిర్ణేత కమిటీ – కలకత్తా
ప్రాంతీయ న్యాయనిర్ణేత కమిటీ – మద్రాస్
  • సి. ఆర్. పట్టాభిరామన్ (అధ్యక్షుడు) * ఎ. ఎన్. కృష్ణరావు * దేవకి గోపిదాస్ * కె.సుబ్రహ్మణ్యం * ఎస్. కె. నాయర్ * డి.వి.యస్.రాజు * టి. ఇ. వాసుదేవన్ * వి. సి. సుబ్బురామన్ * బి. అనంతస్వామి * డి. ఎన్. రావు

పురస్కారాలు

మార్చు

పురస్కారాలను కథా చిత్రాలు,కథేతర చిత్రాలు అనే రెండు విభాగాలుగా విభజించారు.

అఖిల భారత ఉత్తమ కథా చిత్రానికి రాష్ట్రపతి స్వర్ణ పతకం ప్రస్తుతం భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సినిమాగా ప్రసిద్ధి చెందింది. అదేవిధంగా, ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రానికి రాష్ట్రపతి స్వర్ణ పతకం ప్రస్తుతం ప్రదానం చేసే భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నాన్-ఫీచర్ చిత్రంకు సమానమైనది. బాలల చిత్రాల విభాగంలో అప్పట్లో ప్రదానం చేసిన ప్రధానమంత్రి స్వర్ణ పతకం ప్రస్తుతం భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ బాలల సినిమాగా ఇవ్వబడుతోంది. ప్రాంతీయ స్థాయిలో అప్పట్లో ప్రదానం చేసిన ఉత్తమ కథా చిత్రానికి రాష్ట్రపతి రజత పతకం ప్రస్తుతం ఆయా భాషలలో ప్రదానం చేసే జాతీయ ఉత్తమ కథా చిత్ర పురస్కారంగా కొనసాగుతోంది. అన్ని విభాగాల్లో అప్పట్లో ప్రదానం చేసిన ప్రశంసాపత్రంను అనంతర సంవత్సరాల్లో క్రమంగా రద్దు చేశారు.

కథాచిత్రాలు

మార్చు
ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్న ఉత్తమ్ కుమార్
జాతీయ పురస్కారాలు[1]
ప్రాంతీయ పురస్కారాలు[1]
  • ఉత్తమ బెంగాలీ చిత్రానికి రజత పతకం - ఆరోగ్య నికేతన్
  • ఉత్తమ హిందీ చిత్రానికి రజత పతకం - హమ్‌రాజ్
  • ఉత్తమ కన్నడ చిత్రానికి రజత పతకం - బంగారద హూవు
  • ఉత్తమ మలయాళ చిత్రానికి రజత పతకం - అన్వేషిచు కండతియిల్ల
  • ఉత్తమ మరాఠీ చిత్రానికి రజత పతకం - సంత్ వహాతే కృష్ణమాయి
  • ఉత్తమ ఒరియా చిత్రానికి రజత పతకం - అరుంధతి
  • ఉత్తమ పంజాబీ చిత్రానికి రజత పతకం - సట్లుజ్ దే కందె
  • ఉత్తమ తమిళ చిత్రానికి రజత పతకం - ఆలయం
  • ఉత్తమ తెలుగు చిత్రానికి రజత పతకం - సుడిగుండాలు

కథేతర చిత్రాలు

మార్చు
లఘుచిత్రాలు[1]
  • ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం - ఇండియా'67 (సంగీతం మాత్రమే)
  • ఉత్తమ విద్యావిషయక చిత్రం - అక్బర్ (ఇంగ్లీష్)
  • ఉత్తమ సామాజిక అంశాల చిత్రం - ఐ యామ్ 20 (ఇంగ్లీష్)
  • ఉత్తమ వాణిజ్య ప్రచార చిత్రం - ద బ్రౌన్ డైమండ్ (ఇంగ్లీష్)
  • ఉత్తమ వాణిజ్యేతర ప్రచార చిత్రం - సందేశ్ (హిందీ)
  • ఉత్తమ ప్రయోగాత్మక చిత్రం - త్రూ ద ఐస్ ఆఫ్ ఎ పేయింటర్ (ఇంగ్లీష్)
  • ఉత్తమ యానిమేషన్ చిత్రం - ఇంక్వైరీ (సంగీతం మాత్రమే)

మూలాలు

మార్చు
  1. 1 2 3 4 5 "15th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived (PDF) from the original on 25 July 2020. Retrieved 2 September 2020.
  2. The Times of India, Entertainment. "National Awards Winners 1967: Complete list of winners of National Awards 1967". timesofindia.indiatimes.com. Archived from the original on 24 March 2020. Retrieved 11 August 2021.

బయటి లింకులు

మార్చు